సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఇటీవల గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న మదన్ రెడ్డిని సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలో మరింత క్రియాశీలంగా పాల్గొనాలని ఆకాంక్షించారు. గత కొన్నేళ్లుగా ప్రజల కోసం నిరంతరం పని చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన మదన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరారు. వీరి వెంట పలువురు నాయకులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన నాయకులు
Published On: March 23, 2025 5:01 pm
