విద్యార్థులలో నాయకత్వం, క్రమశిక్షణ పెంపొందించాలి
– ది షీల్డ్ వ్యవస్థాపకుడు ఎన్. సంతోష్ కుమార్
ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇన్వెస్టిచర్ వేడుక
కొత్తగా ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం
క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరమని ప్రేరణ
కౌన్సిల్ సభ్యులకు బ్యాడ్జ్‌లు, సాషెస్‌ల ప్రదానం
విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 22
జవహర్ నగర్,విద్యార్థుల్లో నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడమే విద్య లక్ష్యమని ది షీల్డ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం కాప్రాలోని ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జూనియర్, సీనియర్ విభాగాలకు కొత్తగా ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులను అధికారికంగా చేర్చుకునేందుకు ఇన్వెస్టిచర్ వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జోనల్ బిజినెస్ హెడ్ ఎన్. రవి నాయక్, ప్రిన్సిపాల్ అల్లూరి సుమితారావు, స్కూల్ మేనేజర్ సందీప్ నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి దశలో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో వివరించారు.
విద్యార్థులు పాఠశాల విలువలను నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేయగా, కౌన్సిల్ సభ్యులకు బ్యాడ్జ్‌లు, సాషెస్‌లను ప్రదానం చేశారు. ఈ వేడుక ఆర్కిడ్స్ విద్యార్థులకు గర్వకారణంగా నిలిచి, జట్టు కృషి, సమగ్రత, నాయకత్వ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.