వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం

విద్యార్థి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
Headlines
  1. వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతం
  2. తెలంగాణలో విద్యార్థుల ఆరోగ్యానికి హాని: ఫుడ్ పాయిజన్ సమస్యపై ఎస్ఎఫ్ఐ నిరసన
  3. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కోసం ఉద్యమం
  4. తెలంగాణలో విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత
  5. సిద్దిపేటలో ఎస్ఎఫ్ఐ నాయకులు: విద్యార్థులకు సురక్షితమైన భోజనం అందించండి

సిద్దిపేట నవంబర్ 30 ప్రశ్న ఆయుధం : 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మెరుగు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి బంద్ విజయవంతం జరిగిందని వారు తెలిపారు దాని అనంతరం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులు నుంచి రోజుకు ఒక పాఠశాలలో రోజుకొక హాస్టల్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని అలాగే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మరణించారని వారు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ అవుతున్న ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వారు అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని వారు కోరారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే నాణ్యమైన భోజనం అందించక పోయినా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ప్రవీణ్ అరుణ్ అజయ్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment