అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు 

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు

– డిఎస్పీ అడ్లూరి రాములు 

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు 

తీసుకుంటామని మెట్పెల్లి డిఎస్పీ అడ్లూరి రాములు హెచ్చరించారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్పల్లి డిఎస్పి రాములు ఆధ్వర్యంలో ‘రౌడీ మేళా’ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ అడ్లూరి రాములు కోరుట్ల సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయకూడదని, చట్ట విరుద్ధ పనులు చేయకూడదని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. వారి ప్రస్తుత వివరాలను సేకరించి వారిపై నిఘా పెంచే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment