Headlines :
-
రమాదేవి ఇంటిపై దాడి: చట్టరీత్యా చర్యలు చేపట్టాలనే విజ్ఞప్తి
-
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు: ఒంటెల సుమ, సత్యనారాయణ రెడ్డిపై చర్యలు
-
చెట్లను కొట్టివేసి ముకుమ్మడిగా దాడి: విచారణకు ఆదేశాలు
-
శ్వేత పత్రం విడుదల చేయాలనే డిమాండ్
-
కరీంనగర్ లోని మునిసిపల్, రెవెన్యూ, అటవీ శాఖలతో సమన్వయం
ప్రజావాణిలో V. రాజు, K. అంజయ్య జిల్లా కలెక్టర్ ను కలిసి 9 ఆగస్టు 2024న రమాదేవి ఇంటి ఆవరణంలో చొరబడి చెట్లను కొట్టివేసి నానా విధాలుగా బీభత్యాలు సృష్టించి గోడను కూల్చి చంపుతామంటూ ని కుటుంబాన్ని హతమార్స్తామంటూ బహిరంగంగా హెచ్చరించిన ఒంటెల సుమ, సత్యనారాయణ రెడ్డి పోలీసులు, మహిళలు వారి అనుచరులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. రమాదేవి ఇంటిపై దాడి చేయడానికి గల ప్రధాన కారణం గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన 3,4 సెప్టెంబర్ 2022వ సంవత్సరము నిబంధనలకు వ్యతిరేకంగా చెట్ట విరుద్ధంగా ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి మరియు వారి అనుచరులు పేలుళ్లు జరపగా విచారణకు వచ్చినటువంటి పోలీసులు, మునిసిపల్, రెవెన్యూ , అటవీ, సంబంధిత శాఖ అధికారులు విచారించగా జరిగినటువంటి వాస్తవాన్ని వారికి వివరించడం జరిగింది. వారి వివరణలతో పాటు స్థానికంగా ఉన్న సిసి ఫుటేజ్ లను పరిశీలించి పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ధ్రువీకరించినారు. ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కక్ష్య పెంచుకొని రమాదేవి కుటుంబం పై ఆగస్టు 9న ముకుమ్మడిగా దాడి చేసి హతమార్స్తామని బహిరంగంగా హెచ్చరించి ఇంటి ఆవరణంలోని చెట్లను కొట్టివేయగా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలీ సత్పతి అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. కరీంనగర్ అర్బన్ తహసిల్దార్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, జిల్లా అటవి శాఖ అధికారులకు వేరువేరుగా ఫిర్యాదులు చేస్తూ విచారణ జరిపి చెట్టరీత్యా చర్య తీసుకుంటూ నివేదికలతో పాటు శ్వేత పత్రం విడుదల చేయాలని పై శాఖలతో పాటు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడం జరిగింది.