Site icon PRASHNA AYUDHAM

సంగారెడ్డిలో లీగల్ అవగాహన సదస్సు: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య

IMG 20251204 203315

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో రాగింగ్ నిషేధ చట్టం, ఎన్ డీపీఎస్ చట్టం మరియు పోక్సో చట్టంపై ప్రత్యేక లీగల్ అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి–కమ్–సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య పాల్గొని విద్యార్థులకు చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాంపస్‌లలో రాగింగ్ చిన్నపాటి సరదాగా భావించడం పెద్ద తప్పు అని, ఇది తీవ్రమైన నేరమని తెలిపారు. జూనియర్లపై మానసిక/శారీరక వేధింపులు రాగ్గింగ్ ప్రోహిబిషన్ యాక్ట్ ప్రకారం జైలు శిక్షలు, క్రిమినల్ కేసులు, కాలేజీ సస్పెన్షన్, సర్టిఫికేట్ రద్దు వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని చెప్పారు. రాగింగ్‌ను చూసి మౌనం పాటించడం కూడా నేరమేనని, సీనియర్లు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఎన్ డీపీఎస్ చట్టంపై కీలక సూచనలు ఎన్ డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ కలిగి ఉండటం, వాడటం, సరఫరా చేయడం వంటి కర్మలకు భారీ జరిమానాలు, కఠిన జైలు శిక్షలు తప్పవని ఆమె హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి, కుటుంబానికి, భవిష్యత్తుకే ప్రమాదమని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలేజీల్లో డ్రగ్-ఫ్రీ వాతావరణం సృష్టించడంలో విద్యార్థులు చురుకుగా ఉండాలని కోరారు. పోక్సో చట్టంపై స్పష్టత చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం కింద ఏ విధమైన వేధింపులకైనా తీవ్రమైన శిక్షలు విధించబడతాయని సౌజన్య చెప్పారు. మైనర్లపై ఆన్‌లైన్ వేధింపులు, గోప్యత ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన కూడా ఈ చట్టం కింద నేరాలేనని వివరించారు. తప్పనిసరి రిపోర్టింగ్ నిబంధన గురించి కూడా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రఘునందన్ రావు , సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య, టౌన్ సీఐ, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version