Headlines (Telugu):
-
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు కావాలి – OC సంఘం డిమాండ్
-
EWS కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి – అఖిల భారత ఓసి సంఘం
-
అగ్రవర్ణ పేదల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు
(చలో ఢిల్లీ) న్యాయబద్ధమైన పోరాటానికై
అగ్రవర్ణ పేదలకు (EWS) కార్పొరేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఏర్పాటు చేయాలి.
అగ్రవర్ణాల పేరుతో 78 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అడ్డుపెట్టి అగ్రవర్ణ పేదలను అణగదుకుతున్నా ప్రభుత్వాల నిరంకుశ పాలనను నిదుర లేపుదాం రండి తరలి రండి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన విధానాల వల్ల అగ్రవర్ణ పేదలు అన్ని రంగాలలో వెనుకబడి పోతున్నారు.
అగ్రవర్ణాలలో పుట్టడమే పాపమా.
మంచి చెడులు కలిమీ లెమ్ములూ ఒక వర్గానికో ప్రాంతానికీ అందరికీ ఒకేలా వర్తించవు. అలా. అగ్రవర్ణ కులంలో పుట్టిన వారందరూ బంగారు సంచులను చేతిలో పట్టుకొని పుట్టరు.. ఒక కులంలో పుట్టడం శాపం కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి శిశువూ ఆత్మగౌరవంతో బతికేలా అందరికీ సమాన అవకాశాలు. సదుపాయాలు. ప్రోత్సాహం అందేలా చూడడం. అన్ని రకాల విచక్షణాలు అంతరించేలా చేయడం రాజ్యాంగం చేత సూచించబడిన రాజ్యం విధి.కానీ. ఓటు బ్యాంకు రాజకీయాల వికృత పరిణామం వల్ల అగ్రవర్ణాలను అణచివేసే విధానాలు. వాగ్దానాలు నేటి ఫ్యాషన్.ఎన్నో అర్హతలు ఉత్సవం. శ్రమించే తత్వం ఉన్న పేద అగ్రవర్ణాలు నేడు రెంటికీ చెడిన రేవు అవుతున్నారు. అటు అవకాశాలు అందిపుచ్చుకోలేక, అర్హతలు కొనుక్కోలేక. ఉత్సవంతో ఉద్యమ తత్వం చేపట్టలేక. సామర్థ్యానికి తగిన అవకాశాలు రాక. దేశాభివృద్ధిలో పాలుపంచుకోలేక రోజులను వేల్లదీస్తున్నారు. సమాజం బరువు మోయగలిగిన వారు. నేడు సమాజానికి భారమవుతున్నారు.
రాజ్యాంగబద్ధ పాలన అగ్రవర్ణ పేదలకు వర్తించదా?
ప్రభుత్వాలు కోర్టులు వీరి బాధను గ్రహించలేవా?*
ఈ చట్టాలు వీరి సమస్యలను పరిష్కరించలేవా?*
ఈ దేశ సంపద మీద అగ్రవర్ణ పేదలకు హక్కు లేదా?
గౌరవంగా జీవించడం జీవించే హక్కులో భాగమే అనే తీర్పులు అగ్రవర్ణాల పేదలకు వర్తించవా?*
ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలు
రెంటికీ చెడిన రేవడిలా అయిన అగ్రవర్ణ పేదల సంక్షేమం. అభివృద్ధికి రాజ్యాంగ బద్ధత కల్పించాలి అమలు కొరకు ప్రభుత్వాలు బాధ్యతగా ఉండేందుకు కొన్ని చట్టబద్ధ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.అందుకై.అగ్రవర్ణ పేదల సంక్షేమం అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానాన్ని ప్రకటించి. ఆమోదించి. చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణ పేదల అభివృద్ధికి సంబంధించిన విశాల విధానాల రూపకల్పన అమలులో సలహాలు సూచనలకై జాతీయ రాష్ట్ర స్థాయిలలో తగు అధికారాలతో అగ్రవర్ణ పేదల కమిషన్లు ఏర్పాటు చేయాలి.అగ్రవర్ణ పేదల హార్దిక విద్య. సాంఘిక. జీవన ప్రమాణాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఉప ప్రణాళిక (sub – plan) చట్టబద్ధంగా రూపొందించాలి. బడ్జెట్లో కనీసం 10% నిధులు సబ్ ప్లాన్ కి కేటాయించాలి. ఉద్దేశపూర్వకంగా. అకారణంగా అగ్రవర్ణాలను నిందించడం. హింసించడం. దోపిడి అత్యాచారం. హత్యలను నిరోధించడానికి అగ్రవర్ణ పేదల ( అత్యాచారాల నిరోధక )చట్టం. రూపొందించి అమలు పరచాలి. వీరిపై జరిగే అత్యాచారాలు. ఆస్తుల అక్రమణ. ధ్వంసం మానవ అక్రమ రవాణా. వ్యక్తిగత ఆస్తుల మీద దాడులను నిరోధించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి. బాధితులకు సత్వర న్యాయం పరిహారం. పునరావాసం కల్పించేలా చట్టం రూపొందించి. అమలుపరచాలి.అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను ఎదుర్కోవడంలో న్యాయ సహాయకులను కల్పించాలి.ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థలలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కొరకు తగు రోస్టర్ పాయింట్లు నిర్ధారించి తగు నిష్పత్తిలో ప్రాతినిథ్యం కలిగేలా చూడాలి. అగ్రవర్ణ పేదల మతాచారాలు. సంస్కృతి సాంప్రదాయాలకు రక్షణ గౌరవం కల్పించాలి. అగ్రవర్ణ పేదల సంక్షేమం అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను. మంత్రిని నియమించాలి. అగ్రవర్ణ పేదల విద్యాభివృద్ధికి ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలి. స్కాలర్షిప్లు బుక్స్ కెరీర్ గైడెన్స్. వడ్డీ లేని సాంకేతిక విదేశీ విద్య రుణాలు. నగదు ప్రోత్సాహాలు కల్పించాలి.అగ్రవర్ణ పేదల ఆదాయాభివృద్ధి. ఆర్థిక స్వలంబనకు ఆర్థిక. సహకార సంస్థలు ఏర్పరిచి తగిన నిధులు కేటాయించి. ప్రభుత్వం గ్యారెంటీగా నిలవాలి. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి పథకాలలో తగు నిష్పత్తిలో లబ్ధిదారులను ఎన్నిక చేయాలి. అగ్రవర్ణ పేదల ఆరోగ్య రక్షణకు. ఆపరేషన్ ట్రీట్మెంట్ లకు తగిన నిధులు కేటాయించాలి.అగ్రవర్ణ పేదల అభివృద్ధికి సమీకృత అభివృద్ధి పథకాలు. రూపొందించి. నిజాయితీగా అమలుపరచాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మార్కెట్ సౌకర్యాల కల్పన ఉపాధి కల్పనా. పథకాలలో తగు నిష్పత్తిలలో నిధులు కేటాయించాలి కాలానుగుణంగా మారి అవకాశాలు. ఛాలెంజ్ లకు అనుకూలమైన సలహాలు సూచనలకు నిష్పత్తుల కమిటీలు కమిషన్లు ఏర్పరచాలి.మా అగ్రవర్ణ పేదల న్యాయబద్ధమైన డిమాండ్లు..మీ పెంజర్ల మహేందర్ రెడ్డి*అఖిల భారత ఓసి సంఘం మరియు (ఈడబ్ల్యూఎస్)*ఎకనామికల్ వీకర్ సెక్షన్జాతీయ అధ్యక్షుడు..9666606695..
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁