లీగల్ నోటీసులే నీ రాజకీయ జీవితనికి కి సమాధి..

నోటీసులే

లీగల్ నోటీసులే నీ రాజకీయ జీవితనికి కి సమాధి..

-మిస్టర్ కేటీఆర్…లీగల్ నోటీసులే నీ రాజకీయ జీవితానికి సమాధి
-ఆట మీరు మొదలు పెట్టారు…మేం ముగిస్తాం
-మేం నోటీసులిస్తే నువ్వు పారిపోయే రోజులొస్తయ్
-చదువులేనోళ్లు గ్రూప్ 1 అభ్యర్థుల కోసం పోరాడకూడదా?
-చదువుకోలేని ప్రజలందరినీ అవమానిస్తవా?
-కష్టపడి పైకొచ్చిన బీసీ నేత బండి సంజయ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తవా?
మాజీమంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి ఫైర్.
‘మిస్టర్ కేటీఆర్… లీగల్ నోటీసులతో మీరు ఆట మొదలు పెట్టారు. ఆ ఆటను మేం ముగిస్తాం. బండి సంజయ్ పైన, బీజేపీ నేతలపైన మీరు, కేసీఆర్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, బూతు మాటలకు వెయ్యి నోటీసులిచ్చినా తప్పులేదు. మీ రాజకీయ జీవితానికి పోయే కాలం దాపురించినట్లుంది. మేమిచ్చే లీగల్ నోటీసులతో మీరు పారిపోయే రోజులు రాబోతున్నయ్ మాజీమంత్రి కేటీఆర్ కు భారతీయ జనతా పార్టీ నేతలు ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇది. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. వారేమన్నారంటే….

-డాక్టర్ ప్రకాశ్ రెడ్డి

కేటీఆర్.ఆట మీరు మొదలుపెట్టారు. మేం ముగిస్తాం. రాజకీయాల్లో నోటీసులే సమాధానమైతే నీకు వంద నోటీసులు పంపాలి. మీ నాన్నకు వెయ్యి నోటీసులు పంపాల్సి ఉంటుంది. మీరు బండి సంజయ్ తోపాటు బీజేపీ నాయకులపై చేసిన వ్యక్తిగత ఆరోపణలను, బూతు పురాణాలను చూస్తే ఎన్ని నోటీసులు ఇవ్వాలో గుర్తు చేసుకో. మీరు మాట్లాడిన మాటలకు రియాక్షన్ గా బండి సంజయ్ మాట్లాడారు. నువ్వు మా సంజయ్ ను గుండుగాడు, దద్దమ్మ, సన్నాసి, సదువు లేనోడంటూ వెకలిగా మాట్లాడలేదు. లేనిపోని ఆరోపణలు, బూతు భాష మాట్లాడారో లీగల్ నోటీసులకు భయపడే దద్దమ్మలు ఇక్కడ ఎవరూ లేరు. ప్రతిరోజు అనేక ఆరోపణలు, నోటీసులను అధిగమించిన పార్టీ బీజేపీ. మేం లీగల్ నోటీసులిస్తే… మీరు పారిపోయే రోజులు వస్తయ్. నీ రాజకీయ జీవితానికి పోయే కాలం దాపురించింది. అన్నింటికీ సమాధానం చెబుతాం.

-బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. సాక్షాత్తు ఎంపీ కార్యాలయంలో ఉండగా పోలీసులను పంపి ఆఫీస్ గేట్లు బద్దలు కొట్టించి బండి సంజయ్ ను ఈడ్చుకుపోయి అరెస్ట్ చేసి అవమానించిన దుర్మార్గాన్ని ప్రజలింకా మర్చిపోలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బండి సంజయ్ పై అక్రమంగా పేపర్ లీక్ కేసు పెట్టి హింసించి ఆరెస్ట్ చేసిన సంగతిని ప్రజలు మర్చిపోలేదు.
గుండుగాడు, బండిగాడు, దద్దమ్మ, సన్నాసి, చదువులేనోడు అంటూ బీసీ నాయకుడిని అడుగడుగునా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అవమానించిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. మీ అహంకారంతో సంజయ్ ను ఘోరంగా తూలనాడారు. ఆనాడు మీరే హింసించి మీరే అవమానించి ఇంకా మీరే నోటీసులిస్తారా? మీ నోటీసులకు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. బీజేపీకి కూడా లీగల్ టీం ఉంది. మేం కూడా ధీటుగానే బదులిస్తాం.
చదువు లేనోళ్లు గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన ఏం పోరాడతారంటూ అవమానించినవ్. అంటే నీ ద్రుష్టిలో పీహెచ్ డీ చేసిన వాళ్లు మాత్రమే పోరాటాలు చేయాలా? సామాన్యులు, చదువులేనోళ్లు బాధితుల కోసం పోరాడకూడదా? ఇంతకంటే అవమానం ఉందా? రాష్ట్ర ప్రజలందరినీ అవమానించడమే. ప్రజలను, నాయకులను అవమానిస్తూ బూతు మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మీకు త్వరలోనే తగిన సమాధానం చెబుతాం.

Join WhatsApp

Join Now