Site icon PRASHNA AYUDHAM

వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్దపులి కదలికలు

IMG 20241229 WA0039

*వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్దపులి కదలికలు*

వరంగల్ జిల్లా: డిసెంబర్ 29

నర్సంపేట మండలంలోని జంగాలపల్లి తండాలో పెద్దపులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత మూడు రోజులుగా నల్లిబెల్లి మండలంలో పెద్దపులి సంచరించిన విషయము పాఠకులకు తెలిసిందే,

తాజాగా పులి ఆనవాళ్లు నర్సంపేట మండలంలో అధికారులు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం… ఆది వారం ఉదయం నర్సంపేట మండలం లో రాజుపేట శివారు జంగాలపల్లి తండా సమీపంలోని పంట పొలాల్లో పులి అడుగులు ఉన్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

సంఘటనా స్థలికి చేరుకు న్న అటవీశాఖ అధికారులు అవి పులి అడుగు ముద్రలే అని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సంపేట మండల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలో పులి సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సాయంత్రం 4 గంటల లోపు పొలాల్లోకి వెళ్లిన అందరు ఇండ్లళ్లకు చేరుకోవాలన్నా రు. ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా సమూహంగా వెళ్లాలన్నారు. పశువుల, మేకల కాపలాదారులు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట సీఐ రమణ మూర్తి హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version