ఆశలకు లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించాలి
ఆశాలకు 18000 వేతనం చెల్లించాలి
ఆశాలు లేని గ్రామాలలో వెంటనే ఆశలను నియమించాలి
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాఠీ కృష్ణమూర్తి
జగదేవపూర్ డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం :
జగదేవపూర్ మండలంలోని తిగుల్ పి హెచ్ సీ, జగదేవపూర్ పి హెచ్ సీ పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాఠీ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో కలిసి తిగుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, జగదేవపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సత్య ప్రకాష్ లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాఠీ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆశాలకు కనీస పిక్స్ డ్ వేతనం 18000 ఇవ్వాలని, ఆశాలు పోస్టులలో కొత్తవారిని నియమించాలని పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2023 లో సగం జిల్లాలకు 2024 లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆశాలు చేసిన లెప్రసీ డబ్బులు 2024 లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఆశాలకు చెల్లించలేదు అని అన్నారు. ఈ అంశం పైన కమిషనర్ ఆఫీసులో సంబంధిత అధికారులను సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో కలిసినప్పుడు లెప్రాసి రెండు సంవత్సరాల సర్వే డబ్బులు మేము రిలీజ్ చేసి చాలా కాలమైంది సర్వేకు ముందే ఈ బడ్జెట్ మేము రిలీజ్ చేస్తున్నామని తెలియజేస్తూ మాకు బడ్జెట్ వివరాలతో కూడిన సామాజిక ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ ఆర్డర్ కాపీలు తీసుకొని అన్ని జిల్లాలలో మా సీఐటీయు నాయకత్వం జిల్లా డీఎంహెచ్వో అధికారులు కలిసి పెండింగ్ లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలని కోరారు దీనిపైన జిల్లా అధికారులు స్పందిస్తూ మాకు పైనుండి డబ్బులు రాలేదని ప్రోజిడింగ్ ఆర్డర్స్ ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టు కాదని అన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సంబంధిత అధికారులకు తెలియజేశారని అన్నారు. ఇప్పటికైనా లెప్రసీ పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగదేపూర్ మండలంలోని ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు మాధవి, కవిత, నిర్మల, అనురాధ, పద్మావతి, ఉమారాణి, బాలమని, కవిత, ప్రియాంక, మమత, సంతోష, వసంత, సలీం తదితరులు పాల్గొన్నారు.