నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇక తేల్చుకుదాం

నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇక తేల్చుకుదాం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందిస్తూ, బీసీ ఉద్యమాన్ని నిలువరించడానికి సాంకేతికంగా, శారీరకంగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రజల ముందు బయటపెట్టారు.ఆఫీస్‌ ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన, “హత్యాయత్నాలు చేస్తే మల్లన్న వెనకడుగు వేస్తాడనుకుంటే అది మీ భ్రమే” అని స్పష్టం చేశారు.“మా గన్‌మెన్ వద్దున్న తుపాకీని లాక్కుని మా సిబ్బందిని చితక్కొట్టారు. నన్ను కూడా కొట్టి గాయాలు చేశారు. ఈ దాడి యావత్ తెలంగాణ ప్రజల మనసుకు దెబ్బకొట్టే పని. నువ్వు, నేను.. ఎవరు నిజాయతీగా ఉన్నామో, ఎవరు రౌడీయిజం చేస్తున్నారో ప్రజలే తీర్పు చెబుతారు,” అని మల్లన్న వ్యాఖ్యానించారు.

ఆయన ఆరోపణలు ఇలా కొనసాగించారు:

“కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం నేరుగా ఈ దాడికి పూనుకున్నారు. మా ప్రాణాల మీదకు వచ్చారు. ఇది తేల్చుకోవాల్సిన పరిస్థితి.”“నాకు గాయాలయ్యాయి. మా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆఫీస్‌లో నా రక్తం కార్చారు. ఈ రక్తపు మరకలతోనే నేనిప్పుడు బయటకు వస్తున్నాను.”“రౌడీయిజం చేసి, దాడి చేసి, పైగా నామీదే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం? ప్రజలే చూస్తారు.”ప్రభుత్వానికి విజ్ఞప్తి: “ప్రభుత్వం ఈ దాడి ఘటనపై స్పష్టంగా స్పందించాలి. మేము ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు, న్యాయ వ్యవస్థపైన మా విశ్వాసం ఉంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం,” అని తెలిపారు.తన ఉద్యమం కొనసాగిస్తానని స్పష్టంచేసిన మల్లన్న“కంచం – మంచం అన్నది తెలంగాణలో ఊతపదం. నేను చేసిన వ్యాఖ్యలకు, నా పోరాటానికి నేడు కూడా కట్టుబడి ఉన్నాను. నేనేం తప్పు మాట్లాడలేదని, ప్రజలే నిర్ణయిస్తారు,” అని తేల్చిచెప్పారు.తీరా ఆవేశంతో,“ఇక మేము ఊరుకోం. మిమ్మల్ని, మమ్మల్ని ప్రజల ముందు తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది,” అని ధీటుగా హెచ్చరించారు.

Join WhatsApp

Join Now