స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిద్దాం
ఎన్నికల సన్నాహాక కమిటీ ఇంచార్జి లక్ష్మారెడ్డి
కరీంనగర్ జూలై 24 ప్రశ్న ఆయుధం
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించే విదంగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎన్నికల సన్నాహాక కమిటీ మండల ఇంచార్జి, కరీంనగర్ వెస్ట్ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండలం లోని కొత్తపల్లి గ్రామంలో గురువారం మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. గతం లో పనిచేసిన ఎంపీటీసి, సర్పంచ్ ల వైపల్యాలను ఎండగట్టేవిధంగా ప్రతీ గ్రామం లో కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపారు. దేశం లో అమలుపరుస్తున్న ప్రతీ సంక్షేమ పథకం గ్రామాల్లో కూడా అమలవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కేవలం బీజేపీ కే సాధ్యమని అన్నారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల పరిపాలన, అభివృద్ధి కుంటుపడిపోతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి పై ప్రశ్నించాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి తో పాటుగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి బీజేవైఎం రాష్ట్ర నాయకురాలు చాడ అనితా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్ చింతం శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, తదితరులు సమావేశం లో పాల్గొన్నారు.