కార్మిక వర్గాల “ఆశాదీపం” సిపిఎం పార్టీ మహాసభలను జయప్రదం చేయండి 

కార్మిక వర్గాల “ఆశాదీపం” సిపిఎం పార్టీ మహాసభలను జయప్రదం చేయండి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి పిలుపు

గజ్వేల్ నవంబర్ 29 ప్రశ్న ఆయుధం :

సిపిఎం పార్టీ ప్రస్థానంలో సిద్దిపేట జిల్లాలోని పారిశ్రామిక కేంద్రంలోని ప్రాంతల లో కార్మికుల సంక్షేమానికి,ఉద్యోగ భద్రత కు కార్మికుల గొంతుక గా ఉంటూ అనుక్షణం కార్మికులను చైతన్య పరుస్తూ కార్మిక వర్గాల “ఆశాదీపం” గా కార్మికుల సంక్షేమానికి నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి కార్మిక వర్గాలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ లోని స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలలో కార్మికుల సమస్యలను వెలుగులోకి తేవడం ద్వారా చాల పరిశ్రమలలో పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి కార్మికులకు యాజమాన్యం చెల్లించే విధంగా కృషి చేసిన పార్టీ సిపిఎం అని అన్నారు. అనేక పరిశ్రమలలో కార్మికులపై యాజమాన్యం వేధింపులతో విధులకు అనుమతించక పోతే కార్మికులు చేసిన పోరాటానికి మద్దతు ఇవ్వడంతో పాటు అధికారుల జోక్యంతో సమస్య పరిష్కారానికి చొరవ చూపి కార్మికులను విధులకు తీసుకునే విధంగా కృషి చేయడంతో పాటు పలు పరిశ్రమలలో కార్మికులు ప్రమాదాలకు గురై నష్టపోతే వారికి పరిహారాలు అందించడంలో మరియు ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం అందించడంలో కార్మికుల కుటుంబాల సంక్షేమానికి చేయూత నిచ్చే పార్టీ సిపిఎం అని అన్నారు. గజ్వేల్, కరకపట్ల, వర్గల్, ములుగు ప్రాంతాలలోని పరిశ్రమలలో కార్మికులకు ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు యాజమాన్యాలు పట్టించుకునే విధంగా కృషి చేస్తూ కార్మిక వర్గాలకు చట్టాలపై అవగాహన కల్పించడం సంక్షేమ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు కార్మికులను చైతన్య పరుస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దుచేసి కార్మిక చట్టాల సవరణ పేరుతో లేబర్ కోడ్ లు తీసుకొచ్చినప్పుడు లేబర్ కోడులను వ్యతిరేకిస్తూ వాటి వలన కార్మికులకు జరిగే నష్టాలను పార్లమెంటులో అసెంబ్లీలో కార్మికుల గొంతుగా వినిపించిన పార్టీ సిపిఎం పార్టీ అన్నారు గతంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన సవరణ చేయుట కొరకు కార్మిక సంఘాలు కార్మికులు చేసిన పోరాటాలకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా గత ప్రభుత్వం షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ రంగాలలోని కొన్ని రంగాలలో పద్దెనిమిది వేల రూపాయల నోటిఫికేషన్ తేవడంలో వాటి అమలుకు సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసిందని అన్నారు అసంఘటిత రంగ కార్మికులైన హమాలి, ట్రాన్స్ పోర్ట్ ,భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులపై ప్రభుత్వ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారు శ్రమ దోపిడీ గురికాకుండా వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకునే పథకాలు కార్మికులకు అందే విధంగా మరియు వీటితో పాటు స్కీం వర్కర్లు అయిన అంగన్వాడి,ఆశ,మధ్యాహ్న భోజనం,ఐకెపి,మెప్మా, గ్రామ పంచాయితీ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి వారి పెండింగ్ జీతాలు వారికి రావాల్సిన ఇతర అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వారి సేవలు ప్రజలకు ప్రభుత్వానికి తెలపడం లో సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు సమాజాభివృద్ధి లో కార్మిక వర్గాల ప్రాధాన్యతను గుర్తించి వర్గ పోరాటాల ద్వారానే సమ సమాజాన్ని సాధించాలని కార్మిక వర్గ సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ఎంచుకొని పనిచేస్తున్న సిపిఎం పార్టీని అన్ని రంగాల కార్మిక వర్గాలు ఆదరించాలని కోరినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment