పన్నుల వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో నిలుపుదాము- అభివృద్ధి వైపు పయనిద్దాం

*పన్నుల వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో నిలుపుదాము- అభివృద్ధి వైపు పయనిద్దాం*

*మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్*

*జమ్మికుంట ఫిబ్రవరి 22 ప్రశ్న ఆయుధం*

రాష్ట్రంలో మున్సిపాలిటీల ఆస్తి పన్నులలో రాష్ట్ర స్థాయిలో జమ్మికుంట మున్సిపాలిటీ మొదటి వరుస సాధించి, నిలకడగా మొదటి స్థానాన్ని ఉంచేందుకు సహకరిస్తున్న ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మున్సిపాలిటీ పరిధిలోని పత్రికలకు మున్సిపల్ కమిషనర్ ముహమ్మద్ అయాజ్ ధన్యవాదాలు తెలిపారు. శని వారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఆస్తి పన్ను వసూళ్లలో స్వయంగా మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ పాల్గొని కమిషనర్ అయాజ్ మీడియాతో మాట్లాడుతూ పన్ను చెల్లిస్తాం అభివృద్ధిని ఆకాంక్షిద్దాం అని 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ముందు వరుస స్థానాన్ని నిలకడ ఉంచుతున్నామని అంతే అభివృద్ధితో మున్సిపాలిటీని ఉంచుదామని ఆయన పేర్కొన్నారు జమ్మికుంట మున్సిపాలిటీలో ఇంకా పన్నులు చెల్లించె వారు ఉన్నారని ఈ నెల చివరి వరకు పూర్తిస్థాయిలో పన్నుల వసూళ్లు చేయాలని కమిషనర్ ఆయాజ్ తన సిబ్బందితో తెలిపారు డిమాండ్ 315.38 లక్షలు, వసులు 270.07 లక్షలు , 85.63% శనివారం వరకు వసులు ఆయనవి. మార్చ్ నెల చివరి వరకు వంద శాతం వసులు చేయాలని తెలిపారు. పన్నుల వసూళ్లకు సహకరిస్తున్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గానికి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ భాస్కర్, వాణి, ప్రదీప్, వార్డు ఆఫీసర్లు, , బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now