● నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్
●వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర
భాగమే ఈ చట్టం
● వక్ఫ్ బోర్డు స్వయంప్రతి
హరించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్ సి ఇంచార్జ్ సెప్టెంబర్ 11(ప్రశ్న ఆయుధం న్యూస్)
నవనిర్మాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోవడంతో ఇప్పుడు పార్లమెంటరీ కమిటి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వాయిదా వేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ముస్లిం పర్సనల్లా బోర్డ్ తరపు నుండి ఒక క్యూఆర్ నీ విడుదల చేయడం జరిగింది దాన్ని స్కాన్ చేసి మీ అభిప్రాయం అనేది తెలియచేయొచ్చు ఒకవేళ మనము దీనిపై స్పందించకపోతే మనము దీనిపై మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయకపోతే రేపు భవిష్యత్తులో ఈ చట్టాన్ని అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్ద కుట్ర తో ప్రస్తుతం ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ పై పూర్తిస్థాయిలో అధికారుల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది ఎన్ని వందల సంవత్సరాల నుండి మా పెద్దవాళ్లు కాపాడిన ఎన్నో విలువలైన ఆస్తులను ఈరోజు ఈ ఒక్క చట్టంతో అధికారులు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ లాగుకొనే పెద్ద కుట్ర చేస్తున్నాడు మళ్లీ ఈ చట్టం అమల్లోకి వస్తే దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్వయంగా ప్రధాని మోడీ నే ప్రకటిస్తా అని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కుట్రను తరిమికొట్టాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పడిన కమిటీకి సహకరించి తన వంతు సహకారం ఈ ఒక్క అభిప్రాయంలో తెలియజేసి వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని వ్యతిరేకంగా అందరూ అభిప్రాయాలు చెప్పి ఈ బిల్లుని అమలు కాకుండా అడ్డుకోవాలని కోరడం జరిగింది