మహిళలపై హింసను నిలువరిద్దాం.. వారిని ఎదగనిద్దాం…సత్యం శ్రీరంగం.

మహిళలపై హింసను నిలువరిద్దాం.. వారిని ఎదగనిద్దాం…సత్యం శ్రీరంగం.

IMG 20250311 WA0064

ఆయుధం మార్చి 11: కూకట్‌పల్లి ప్రతినిధి

” మహిళలపై హింసను నిలువరిద్దాం.. వారిని ఎదగనిద్దాం.. ప్రోత్సహిద్దాం.. హక్కులను కాపాడుదాం.. రక్షణగా నిలబడుదాం.. – శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ సత్యం శ్రీరంగం. ”

” మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యాంగా ఉండడం ద్వారా కోరుకున్న రంగంలో చక్కటి అభివృద్ధి సాధించవచ్చు. – కో చైర్ పర్సన్ శ్రీమతి ఇందుమతి శ్రీరంగం. ”

శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ సత్యం శ్రీరంగం, కో చైర్ పర్సన్ శ్రీమతి ఇందుమతి శ్రీరంగం ఖైత్లాపూర్ లోని చీర్స్ ఫౌండేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం పిల్లలకి అన్న ప్రసాద వితరణ చేసారు. ఈ సంద‌ర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ పురుషుల‌తో పాటు అన్ని రంగాల్లో మ‌హిళ‌ల‌ది స‌మాన పాత్ర ఉంటుంది అని చెప్పిన.. కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర త్యాగ‌పూరిత‌మైన‌ద‌న్నారు. ‘‘శక్తి స్వరూపిణి స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ అని అన్నారు. తల్లిగా తోబుట్టువుగా భార్యగా బిడ్డగా భిన్నరూపాలలో స్త్రీమూర్తి అందిస్తున్న సేవలు వెల కట్టలేనివి అని తెలిపారు. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని తెలియజేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకొంటుంటామని అది సత్యమన్నారు స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయని తెలిపారు. మాన‌వ జాతికి మ‌హిళ ఒక వ‌రం. మ‌హిళాభ్యుద‌యానికి చిత్త‌శుద్ధితో రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం కృషి చేస్తోందన్నారు. మ‌హిళ‌ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళా బంధుగా ఆద‌ర‌ణ పొందుతుందన్నారు. శ్రీమతి ఇందుమతి శ్రీరంగం మాట్లాడుతూ పరిశుభ్రత జీవన విధానం కావాలన్నారు. యుక్త వయస్సు ప్రారంభంలో ఉన్న బాలికలు తమ శరీరంలో జరుగుతున్న మార్పులను గుర్తించి, వాటి పట్ల అవగాహనా పెంచుకోవాలన్నారు. ఉత్తమ ఆహారపు అలవాట్లు, చక్కటి నిద్ర మానసిక ఆర్యోగనిస్తాయన్నారు. మహిళలంతా ఆర్థికంగా బలంగా మారడంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. ఉన్నత భవిష్యత్తు కోసం నిరంతరంగా సాధన చేసి అత్యుత్తమ ప్రగతిని సాధించాలని తెలిపారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణించగలమని అతివలు రుజువు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు..అంతరిక్షంలోనూ విహరిస్తున్నారని తెలిపారు. దేశ రక్షణలోనూ మేము సైతం అంటూ బాధ్యతలు తీసుకుని, విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడలు, వ్యవసాయం, వైద్యం, విద్య, రాజకీయం.. ఇలా ఏ రంగమైనా ఆకాశమేహద్దుగా మహిళలు దూసుకుపోతున్నారని తెలియజేసారు. యువత ఆకర్షణలతో పేడదోరణి పట్టి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎంచుకున్న లక్ష్యాలపై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు, గురువులు పెట్టుకొన్న ఆశలను నెరవేర్చాలని తెలిపారు. ఆరోగ్యమైన పౌరులు దేశప్రగతికి కీలకమన్నారు. మహిళలు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మేడ్చెల్ జిల్లా ఉపాధక్షురాళ్లు జ్యోతి, ఏ, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాళ్లు రామగాళ్ల రమాదేవి, సంధ్య, డివిజన్ ల అధ్యక్షురాళ్లు మారుతీ, పొన్నం రజిత, జోజమ్మ, భారతమ్మ, విజయలక్ష్మి, యమున రాధ, గుండా జ్యోతి, . బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, ఎ ఎమ్ సి డైరెక్టర్స్ అరుణ్ గౌడ్, నరేష్, పవన్, మహిళా సీనియర్ నాయకురాళ్లు బండి సుధ, కైలా, కల్పన, నాగ శిరీష, రామేశ్వరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment