సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి
కొమురవెల్లి సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :
వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కొమురవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సత్తిరెడ్డి మాట్లాడుతూ విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి ఆయన గుండాలకు భయపడకుండా కమ్యూనిస్టు పార్టీ అండతో మల్లు స్వరాజ్యం రెడ్డి కృష్ణమూర్తి నాయకత్వంలో ఐలమ్మ తను పండించిన పంటను దక్కించుకోవడం కోసం అమోఘమైనది అని గుర్తు చేశారు కానీ నాడు జరిగిన పోరాటాన్ని వక్రీకరించి హిందూ ముస్లిం మధ్య జరిగిన పోరాటంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తుంది నాడు భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటంలో అనేకమంది వీరమరణం పొందారు వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు పాలకులు అవలంబిస్తున్న ప్రజా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటా లు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రామ్ సాగర్ మాజీ సర్పంచ్ తాడూరు రవీందర్ అత్తిని శారద మండల నాయకులు తాడూరు మల్లేశం పుల్లంపల్లి సాయిలు బక్కిలి బాలకిషన్ నాయకులు ఆరుట్ల రవీందర్ సార్ల యాదయ్య సున్నం యాదగిరి నర్సింలు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.