ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను విద్యకై చేర్పిద్దాం- భవిష్యత్తుకు బాటలు వేద్దాం -ఎంఈఓ రాముల నాయక్

*పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో విద్య కై చేర్పిద్దాం- భవిష్యత్ కు బాటలు వేద్దాం*
*మండల విద్యాధికారి రాముల నాయక్*

*ఇల్లందకుంట జూన్ 7 ప్రశ్న ఆయుధం*

మండలంలో ని సిరిసేడు గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాధికారి కే రాములు నాయక్ పాల్గొని ప్రారంభించారు గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి చదివించాలని వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవైద్యులైన ట్రైనర్ టీచర్స్ ఉంటారని విశాలమైన పాఠశాల ఆవరణ మనోవికాసానికి శరీర దృఢత్వానికి ఆటల ప్రాముఖ్యతను తెలిపే క్రీడామైదానం విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన సాగించబడుతుందని విశాలమైన తరగతి గది లో విద్యాబోధన సాగుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేక చొరవ తీసుకోబడుతుందని నైతిక విలువలతో కూడిన విద్యాబోధన నిర్వహించబడుతుందని ఎస్సీ ఎస్టీ బీసీలకు స్కాలర్ షిప్ ఇవ్వబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జగదీశ్వర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాస్ ఏ అపర్ణ ఉపాధ్యాయులు పాకాల ప్రభాకర్ రెడ్డి కట్కూరు సమ్మిరెడ్డి రాజిరెడ్డి శ్రీనివాస్ రవి కిషన్ సత్యనారాయణ అభిలాష్ రమేష్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కె బి రజని ఉపాధ్యాయ బృందం అంగన్వాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment