సకల జన భోజనాలను జయప్రదం చేద్దాం

*సకల జన భోజనాలను జయప్రదం చేద్దాం*

*గిరిజన సంఘాల జేఏసీ* 

ఖమ్మం : మానవత్వం అనే కులం గుణం కలిగిన మంచి మనసుల సకల జనుల భోజనాల ను జయప్రదం చేయాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు . సోమవారం నాడు ఎన్ఎస్పీ క్యాంపులో గల బంజారే భవన్లో గిరిజన సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్ , ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర చౌహన్ తదితరులు మాట్లాడుతూ కులాల పేరిట మనుషులను వేరు చేయటం మతాల పేరిట వేరు చేయటంఏ రూపం ల్లో జరిగిన ప్రజాస్వామ్యవాదులు మానవత్వం కలిసిన మంచి మనసులు నిరసించాలని వారు పిలుపునిచ్చారు . మానవత్వం కూడినటువంటి మనుషులందరు కలియకే జనం భోజనాలని వారు అన్నారు . డిసెంబర్ 1 సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నడిచే జన భోజనాలలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు . ప్రత్యామ్నాయ సాంస్కృతిని పెంపొందించి కుల నిర్మూలన చైతన్యంతో ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు ప్రజలు ఉద్యోగులు అందరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు . ప్రజల ఐక్యతతోనే గిరిజన సమస్యలు పరిష్కారం అవుతాయని దానికి సమాజం కూడా ఆమోదించాలని వారు అన్నారు . అన్ని కులాల ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కుల భోజనాలకు వెళ్లి కుల గొప్పతనాన్ని చాటింపు వేయటం రాజ్యాంగ విడుదూరం వారు సందర్భంగా విమర్శించారు . రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ప్రజా ప్రతినిధులు కుల మత కార్యకలాపాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేశారు . డిసెంబరు ఒకటి ఆదివారం నాడు బల్లేపల్లిలో మలీదు జగన్ గారి తోటలో జరిగే సకల జన భోజనాలను జయప్రదం చేయాలని వారు ఖమ్మం ప్రజలకు పిలుపునిచ్చారు . ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ , ఎల్ ఎ పి ఎస్ ఇంచార్జ్ బానోత్ రంజిత్ నాయక్ , బొల్లి రాములు , ఏఐబిఎస్ఎస్ బానోత్ బిక్కు నాయక్ , గిరిజన సమైక్య నాయకులు బోడ వీరన్న , సేవాలాల్ సేన నాయకులు రాజకుమార్ , సాయి నాయక్ , జగదీష్ నాయక్ , సురేష్ నాయక్ , శరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment