మాల సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ విజయవంతం చేయండి
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా
మాలల మహాధర్నా ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలిపారు.
మాల సంఘాల జేఏసీ నాయకులు అల్లాడి పౌల్ రాజు మంగళవారం భద్రాచలం పట్టణం సమావేశంలో వెల్లడించారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని అన్ని మాల మరియు మాల ఉపకులాల సంఘాల ఐక్యతతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మరియు ఇతర రాజకీయ పార్టీల విధానంను తీవ్రంగా ఖండిస్తున్నాము.
గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమీషన్ నివేదిక మరియు ఉషా మెహర్ కమీషన్ నివేదికలను తిరస్కరిస్తూ 2004లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 5 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనము ఎస్సీ వర్గీకరణను కొట్టివేసి చారిత్రక తీర్పును ఇచ్చినది. ఇది ప్రపంచానికి విదితమే. 30 సంవత్సరాల తర్వాత రాజకీయ లబ్దికొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాధ్యపడని ఎస్సీ వర్గీకరణ అంశంను భుజాన వేసుకుని ఎస్సీలను విభజించి రాజ్యాధికారణనకు దూరం చేయడానికి కుట్ర పన్నుతున్న రాజకీయ పార్టీలను మాలలు ముక్తకంఠంతో ఎస్సీ వర్గీకరణను ఖండిస్తూ మరియు వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాము.
సామాజిక న్యాయం పేరుతో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం 22% ఉన్న ఎస్సీలను విడగొట్టి విచ్ఛినం చేస్తే ఎస్సీలు బలహీనులు అవుతారనే అగ్రవర్ణ
కుట్రలను అర్థం చేసుకోలేని మాదిగ సోదరులు మాలలను మాత్రం శతృవులుగా చూడడం శోచనీయం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను చూస్తుంటే అసలు ప్రభుత్వ సంస్థలను మొత్తంగా ప్రైవేట్ యాజమాన్యంకు ధారాదత్తం చేస్తున్న తరుణంలో, రాజ్యాంగం కల్పించిన హక్కులు రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి? విద్యా విధానం, పారిశ్రామిక రంగాలు, పరిపాలన వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల మరియు సంస్థల చేతుల్లోకి మారుతుంటే మొత్తం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలు నిశ్చేష్టులై ఉన్న ఈ నాటి పరిస్థితులలో ఉన్న రిజర్వేషన్స్ కే దిక్కులేకుండా పోతుంటే వర్గీకరణను ఉసికొలిపి మన హక్కులను రాజకీయ పార్టీలు మరియు ప్రభుత్వాలు పక్కన పెడుతున్నాయి అన్నారు.
కార్యక్రమంలోజయమ్మ రాణి సత్యవతి సామెలు, సుజాత అరుణ డేగల రాజు సుజాతరాణి తదితరులు పాల్గోన్నారు పాల్గోన్నారు.