(కొంగొత్తగా కొత్త సంవత్సరంలోకి………. నూతన వ్యక్తిత్వంతో ముందుకు సాగుదాం……. కోటి ఆశలతో ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా గడపాలని అందరూ అనుకుంటారు కానీ ప్రయత్నం చేసే వారు మాత్రమే రేపటి ఉషోదయాన్ని (కొంగొత్తగా చూడగలుగుతారు. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి శశి మనల్ని నిద్రలోకి ఆహ్వానం పలుకుతుంది. మరుసటి రోజు సూర్య భగవానుడి వెలివేచ్చని కిరణాలు నీకు స్వాగతం పలుకుతాయి.. ఇలా ప్రతిదినము నీకు తెలియకుండానే అనేకంగా ఈ ప్రకృతి మాత నీ సేవలో ఉంటుందని సంగతి నీకు తెలియనే తెలియదు. ఇలా ఈ జీవితంలోకి అనేక వసంతాలు వచ్చిపోతుంటాయి. ఇన్ని రోజులు సహకరించిన ఈ కాలం నీకు ఏదో ఒక రోజు ఈ జీవితానికి పరిపూర్ణం చేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చి ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోని పాపాన పోయి ఉండడం లెదూ, బహుశా అందుకే క్యాలెండర్ కోలమానమై, పేజీలు తిప్పుతున్నప్పుడు, ప్రతి ఏటా క్యాలెండర్ మార్చినప్పుడు మనకు ఒక గుణపాఠం కావాలి. కాలం కర్తవ్య బోధ చేస్తుంది. ఇంతవరకు చేసిన మంచి చెడులను పరీక్షించుకొని ముందుకు సాగడం కోసం ప్రణాళిక ఏర్పాటు చేసుకొమ్మని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలు స్వీకరించి ఈ జీవితాన్ని పండించుకుంటే పరమాత్మ నీకే పరుగులు తీస్తాడు, లేదంటే ఆ హెచ్చరికలను పెడచెవిన పెడితే మాత్రం ఈ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. చివరి అంకంలో నువ్వు మారుద్దాం అనుకున్నా నీకు సహాయకులుగా ఉన్నాయి కర్నేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అప్పుడు పని చేయడం మానేస్తాయి. ఎందుకంటే అవి మంచిగా పని చేసినప్పుడు వాటి మాట మనం వినలేదు కాబట్టి, వాటిని కూడా జాగ్రత్తగా వాడుకోకుంటే. మరో ప్రమాదం, మన ఒంట్లో శక్తి ఉంది కదా అని విచ్చలివిడతనం ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు ఏదో ఒక రోజు మానవ జీవితానికి కోరికలు సహజం, ఆ కోరిక ధర్మబద్ధంగా తీర్చుకుంటే పర్వాలేదు కానీ, అసుర ప్రవృత్తితో కంటికి నచ్చింది ఒంటికి ఏది పడితే అది స్వీకరించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. నిరంతరం విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే దైవ అనుగ్రహం కూడా నీకు తోడు నిలుస్తుంది. చిన్న చిన్న మార్పులతో మన జీవితం మార్చుకోవాలి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనం ఋూషులం కాకపోవచ్చు, మహర్షులం కాకపోయినా మంచి మనిషిగా జీవించడానికి ప్రయత్నం చేయకపోతే పశువులు కూడా మనల్ని క్షమించే క్షమించవి. నూతన సంవత్సరంలోనైనా ఈ జీవితానికి కావాల్సిన కనీస జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నేడు కాకపోతే రేపు నేర్పే వారు ఎవరు ఉండరు. ఈ జీవితం వర ప్రసాదం . ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసే తప్ప వచ్చింది కాదని సంగతి తెలుసుకోవాలి. పెద్దలు యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఏదైతే ప్రపంచానికి అందిస్తావో తిరిగి అదే పొందుతావు. అందులో అనుమానమే లేదు. ఆడంబరాళ్ల కోసం అప్పులు చేసి తిప్పలు పడకూడదు. అలాగే సంతోషం కోసం చేసే తప్పులు మనిషి జీవితానికి పెనుతిప్పలు తెచ్చిపెడతాయి. ఈ సమాజం ఎంత మంచిదో అంత చెడును కూడా చేస్తుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త నిరంతరం హెచ్చరికలతో ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్లు ఆప్తులవుతారు, చెడును చూసినవాళ్లు శత్రువులవుతారు. రెండిటిని సమానంగా చూసినవాళ్లు మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఇందులో నువ్వు ఏకొవకు చెందుతావో ఆలోచించుకో.
కాలం గిటురాయి కాకపోతే మన ఆలోచనలు మారుతుంటాయి. ఎక్కడో ఒక దగ్గర ఆలోచన ఆగిపోకపోతే ఈ నిరంతర ప్రవాహం అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరగకపోతే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. మనిషికి మనసు ప్రధానం, నీ మనసును అదుపులో పెట్టుకోకపోతే ఆన్నింటికి మార్పు సంభవం కాదు. కాలంతో పాటు వయసు మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆలోచనలో కూడా మార్పు ప్రారంభం కావాలి, బాల్యం గడిచిపోయింది, గడిచి పువ్వు యవ్వనం, ఇక మిగిలింది వృద్ధాప్యం మాత్రమే ఈ వృద్ధాప్యంలో చింతలు, చికాకులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని నిన్ను వెంటాడుతుంటాయి. అప్పుడు మార్పు వచ్చిన ప్రయోజనం శూన్యం. గతంలో చేసిన అనేక పొరపాట్ల నుండి సారాంశం తీసుకొని, సంఘటనను వదిలివేయాలి అప్పుడే ఈ జీవితం ప్రశాంతంగా పరిపూర్ణంగా ముగుస్తుంది. మనం ఎలా జీవించాలో అది మన చేతుల్లో ఉంది అనే సంగతి ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటే ప్రతి క్షణం ఆనందంగా ఆహ్లాదంగా జీవించవచ్చు. “క్యాలెండర్ మారినంత మాత్రాన ప్రయోజనం లేదు సుమా…! మన వ్యక్తిత్వం ఉన్నత శిఖరాలకు తీసుకపోగలిగితే అంతకంటే పెద్ద పండుగ మరొకటుండదు”. అందుకే జర ఆలోచించి జీవించు ఈ జీవితం ఏమి నమ్మమూ. సమీక్ష అవసరం అది ఏ ప్రతిరోజు నువ్వు చూసే ఆ తేదీ మార్పు నీకు ఒక కొత్త పాఠం నేర్పించాలి. సమస్యల సుడిగుండం నుండి సునాయాసంగా బయటపడాలంటే నీకు నువ్వుగా తెలుసుకుని బయటపడే మార్గం వెతుక్కోకపోతే మరెవరో నీకు చేతనిచ్చి చేయి అందించే రోజులు పోయాయి. రాబోయే రోజులు మరింత కఠినంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం మహాకష్టమవుతుంది, అందుకే పెద్దలు అన్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని. నీలోని శక్తిని జ్యోతిగా మార్చుకొని ఈ ప్రపంచానికి సూర్యుడిలా వెలుగకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కాంతిపుంజం కావాలి అప్పుడే ఈ జీవితానికి సార్ధకత అవుతుంది అవునా కాదో ఈ కొత్త సంవత్సరంలో నైనా ఆలోచించండి…….
మీ తుమ్మ కృష్ణ,
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు. 837466327