ప్రకృతి వ్యవసాయ పంటలను తీసుకొని రోగాలను తరిమికొడదాం

*ప్రకృతి వ్యవసాయ పంటలను తీసుకొని రోగాలను తరిమికొడదాం*

*ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఉత్తమ రైతు అవార్డు గ్రహీత శ్రీకాంత్*

*ఇల్లందకుంట నవంబర్ 28 ప్రశ్న ఆయుధం*

ప్రకృతి ఆధారంగా పండించిన పంటలను ఆహార పదార్థాలుగా తీసుకొని ఆధునిక కాలంలో వస్తున్న రోగాలను తరిమికూడదామని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ చైతన్య యూనివర్సిటీ, హైదరాబాద్ కు చెందిన విద్యార్థులు లక్నో యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ చెందిన విద్యార్థులు సందర్శించి ప్రకృతి వ్యవసాయంలో పాటించవలసిన నియమాలను ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గారేంపల్లి శ్రీకాంత్ సవివరంగా వివరించారు విద్యార్థులకు దేశీయ విత్తనాల యొక్క విశిష్టతలను వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు శ్రీకాంత్ వివరించారు శ్రీకాంత్ వద్ద ఉన్న 185 రకాల ప్రాచీన వరి వంగడాలను విద్యార్థులకు చూపించి వాటి యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణతో షుగర్ ఉన్న వ్యక్తికి నవర రకం వరి ధాన్యం యొక్క బియ్యం కాబట్టి వారి వంగడంతో క్యాన్సర్ ను మోకాళ్ళ నొప్పికి నారాయణకామిని సంతానం లేని వారికి మాపిలై సాంబ బియ్యాలతో చికిత్స విధానాన్ని విద్యార్థులకు వివరించారు గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రకృతి వ్యవసాయం యొక్క విశిష్టతను గ్రామ ప్రజలకు నినాదాలతో వివరించారు ప్రకృతి వ్యవసాయం చేద్దాం రోగాలను తరిమికొడదాం రసాయన రహిత గ్రామంగా మన గ్రామాన్ని ఉంచుదాం అంటూ నినాదాలు చేశారు తన వద్ద ఉన్న 185 రకాల దేశీయ వరి విత్తనాలను అవసరం ఉన్న రైతులకు పంపిణీ చేస్తానని శ్రీకాంత్ తెలిపారు ఎక్కువ రోగాలు రాకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను తీసుకోవాలని తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment