ఈనెల14 నుండి గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకోవాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను
జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి వి అర్జున్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు, పాటకులకు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందన్నారు. 14వ తేదీన ప్రారంభోత్సవ వేడుక చిన్నారులకు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, 15వ తారీఖున భావంతో కూడిన పద్యాల పోటీ 16వ తారీఖున వకృత్వపు పోటీ 17వ తారీఖున పుస్తక ప్రదర్శన 18వ తారీఖున వ్యాసరచన 19వ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మహిళలకు విభిన్న కార్యక్రమాలు, 20వ తారీఖున ముగింపు కార్యక్రమం, బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం గ్రంథ పాలకురాలు జి మణి మృదుల (9346382604 ,9642600978 )ను సంప్రదించాలని సూచించారు.

Join WhatsApp

Join Now