బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా ఎల్‌ఐసీ ఉద్యోగుల నిరసన
కామారెడ్డి ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఐక్య పోరాటం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని 100 శాతానికి పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత జీవిత బీమా ఉద్యోగుల సంఘం (AIIEA), క్లాస్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు కామారెడ్డిలో నిరసన చేపట్టారు. నేడు ఎల్‌ఐసీ కార్యాలయంలో భోజన విరామ సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ICEU ఆధ్వర్యంలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఎఫ్‌డీఐ పెంపుతో బీమా వ్యాప్తి పెరగలేదని, ప్రజల పొదుపుపై విదేశీ సంస్థల పెత్తనం పెరుగుతుందని నేతలు హెచ్చరించారు. ఈ దేశ వ్యతిరేక విధానాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని సంఘం అధ్యక్షులు కా. ఎన్.రమేష్ డిమాండ్ చేశారు. ప్రజల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడాలని బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి కా. నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.