అబద్దాల ఆరోపణలు మానండి ఎమ్మెల్యే -కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం
స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అబద్ధపు ఆరోపణలు మానుకోవాలని వారి మాటలు పూర్తిగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు గడ్డి శ్రీనివాస్ అన్నారు శనివారం రోజున గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వము ఏ ఒక్కరోజు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేశారని హుజురాబాద్ నియోజకవర్గం లో బై ఎలక్షన్లు వచ్చిన సమయంలో ఓట్ల కోసం ఒక్కరోజు మాత్రమే రేషన్ కార్డుల ఆశ చూపి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని మాట ఇచ్చి మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డుల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించి అభినందించేది పోయి కోడి గుడ్డుపై ఈకలు పికినట్టుగా బి ఆర్ ఎస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదని అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని అసలు ఎమ్మెల్యే హుజురాబాద్ నియోజకవర్గం లో తిరిగి పేదల సమస్యల పైన రేషన్ కార్డులు వచ్చినయా లేవా అని తెలుసుకుంటే అతనికి నిజలు తెలిసి ఉండేవని ఆయన ఎప్పుడూ బి ఆర్ ఎస్ నాయకులు కేసిఆర్ కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణ చేయడమే సరిపోతుందని పేర్కొన్నారు అలాంటప్పుడు హుజురాబాద్లో తిరగడం లేక నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వార్తల్లో కనపడడానికి మాత్రమే ప్రకటనలు ఇస్తారని పేర్కొన్నారు ఇప్పటికైనా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోని ప్రజల బాగోగులు చూడాలని కోరారు