ఆరుగురికి ప్రాణదానం చేసిన సిద్దు జ్ఞాపకార్థంపరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితిఆధ్వర్యంలో వికలాంగులకు చిరు సహాయం. కొమ్మ గిరి వెంకటేశ్వర్లుస్థానిక వెంకటేశ్వర కాలనీ శ్రీ వెంకటేశ్వర కార్పెంటర్స్ యూనియన్ కార్యాలయం నందు పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి ఆధ్వర్యంలో అతి చిన్న వయసులో సామాజిక ఉద్యమ భావజాలంతో మహనీయుల బాటలో పయనిస్తూ గత రెండు సంవత్సరాల క్రితం ఆరోగ్య సమస్యతో మరణించి ఆరుగురికి ప్రాణదానం చేసిన సిద్దు జ్ఞాపకార్థం వికలాంగులకు నిత్యవసర సరుకులు, బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు, సామాజిక ఉద్యమ పరివర్తకులు ప్రముఖ హేతువాది డాక్టర్ భాను ప్రసాద్, అప్పన దాసుబాబులు మాట్లాడుతూ . సిద్దు చిన్న వయసులోనే ఎందరో మహానుభావులకు ఆదర్శంగా పయనించాడని, మానవత్వం కలిగిన జీవితాన్ని కొనసాగించాడని, సిద్దు మరణం ద్వారా ఆరుగురు జీవితాల్లో వెలుగు నింపిందని, సిద్దులగా అందరూ ఆదర్శవంతంగా జీవించాలని, మరణానంతరం బ్రతికేందుకు మూఢనమ్మకాలను వదిలి అవయవ దానాలు చేయాలని కోరారు. ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, వికలాంగులకు ప్రభుత్వం అన్ని రకాల పథకాలను పింఛన్లు ప్రతినెల సక్రమంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి తమకున్న దాంట్లో పేదలైన వికలాంగులకు నిత్యవసర సరుకులు, బియ్యం పంపిణీ చేయడం జరిగిందనిఅన్నారు. సామాజిక, మానవత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వికలాంగులు తాళ్లప్రగడ శేషు కుమారి, రేపల్లి పద్మ, నల్ల పోతుల రాణి, గొడ్ల జెస్సి, సత్యానంద శ్రీనివాస్, బర్ల జాన్ కుమార్ ,బర్ల సునీత, గూడాల ఆనంద్, బర్ల వెంకట్ , కడారి రితీష్ , దుద్దుకూరి లక్ష్మయ్య మరియు పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి సభ్యులు కోట ప్రభాకర్, లంక యుగంధర్, ఈశ్వర్ రెడ్డి, ఆళ్ల సత్యనారాయణ, భూక్య కిషన్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు కొప్పుల నాగమణి, అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.