రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న ప్రాణదాత ‘కటుకం గణేష్’

రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న ప్రాణదాత ‘కటుకం గణేష్’

డా క్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ 93,వ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 149,వ జయంతి సందర్భంగా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదారాబాద్.రవీంద్ర భారతిలో ఆదివారం కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక, సంఘ సేవకుడు, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ డాఎపిజె అబ్దుల్ కలాం లెజెండరీ 2024 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ సరోజనమ్మతో పాటు సినీ నటుడు నరేన్ తేజ్, పలువురు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలలో రక్తదానంపై కటుకం గణేష్ యువతలో విస్తృత అవగాహన కల్పించి, వేలాది మంది రక్తదాతలను స్వచ్చంధ రక్తదాతలుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, స్వచ్చంధ రక్తదాతలచే రక్తదాన సంధానకర్తగా నిర్వహించిన పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వారు పేర్కొన్నారు. ఇదివరకే పలు రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన గణేష్ కు అబ్దుల్ కలాం లెజెండరీ అవార్డు అందించడం తమ సంస్థకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు. 

గణేష్ ఆధ్వర్యంలో మరిన్ని సమాజహిత కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఆయనకు తమ లాంటి స్వచ్చంధ సంస్థలు వెన్నుదన్నుగా ఉంటాయని వారు తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీత కటుకం గణేష్ మాట్లాడుతూ తన సేవలను గుర్తింపుగా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు డా..ఎ.పి.జె అబ్దుల్ కలాం లెజెండరీ-2024 అవార్డు కు ఎంపిక చేసి, అవార్డును ప్రధానం చేయడం సంతృప్తిని అందించిందని, రక్తదానంపై తాను మరిన్ని విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించుకున్నానని, తనకు సహకరిస్తున్న స్వచ్చంధ రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment