*• లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను అకస్మిక తనిఖీ*
*• విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతపై స్పష్టమైన దృష్టి పెట్టాలి*
*జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 14
సోమవారం రోజున జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా మొదట రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరైన మరియు గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరుల పూర్తిస్థాయిలో వినియోగం మరియు రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది సిబ్బందిలో నిబద్ధతను, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, మాట్లాడుతూ, దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి కేసును నిజాయితీతో, నైపుణ్యంతో, సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విపిఒలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల రక్షణనే ధ్యేయంగా భావిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలని అన్నారు. డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందిస్తూ, ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని అధికారులు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఎస్పీ అందించారు.