సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): మియాపూర్ విశ్వనాధ్ గార్డెన్స్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి రీజియన్ మీట్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ విశేష ప్రతిభ కనబరిచి పలు అవార్డులను దక్కించుకుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గట్టమనేని బాబురావు, పూర్వ గవర్నర్లు పి.సి.ఓబులారెడ్డి, జే.ఆర్. సూర్యరాజ్ ల సమక్షంలో రీజియన్ చైర్మన్ ఇ.వి.రమణ అధ్యకతన నిర్వహించారు. సంగారెడ్డి ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన శేరిలింగంపల్లి రీజియన్ కమిటీ, రీజియన్ పరిధిలోని 18 లయన్స్ క్లబ్‌లలో సంగారెడ్డి ఆదర్శ క్లబ్‌కు మొత్తం ఆరు సేవా కార్యక్రమాల అవార్డులను ప్రదానం చేసింది. అదేవిధంగా క్లబ్‌కు చెందిన ముగ్గురు సభ్యులకు వ్యక్తిగత అవార్డులు అందజేశారు. డీసీ క్లబ్ మోటివేటర్ లయన్ పి.రాములుగౌడ్, ఉత్తమ అధ్యక్షుడు లయన్ పి. రామకృష్ణ రెడ్డి, ఉత్తమ కోశాధికారిగా లయన్ యం.వెంకటేశంలు అవార్డులు పొందారు. ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం విద్య, వైద్యం, పర్యావరణ రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమాజంలో నెలకొన్న వివిధ సామాజిక రుగ్మతలపై ప్రజలను, వివిధ వర్గాలను చైతన్యం చేసే కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ అధ్యక్షుడు లయన్ పి. రామకృష్ణ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్లు ఎస్. విజయేందర్ రెడ్డి, ఎన్. రామప్ప, అనంతరావు కులకర్ణి, యం.వెంకటేశం, లయన్స్ సభ్యులు పెద్దోటి శ్రీనివాస్ గౌడ్, ఆర్.ప్రభాకర్ రెడ్డి, సి.హెచ్.రజనీకాంత్, యం. శ్రీనివాస రెడ్డి, ఎస్. ప్రకాశ్, యం.రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.