మద్యం టెండర్ల ఖాళీ స్థలాలలో నిర్వహించాలి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెల శివకుమార్
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి ఉద్దేశించిన
మద్యం టెండర్ల దరఖాస్తుల స్వీకరణ అనే ప్రహసనాన్ని, నివాసగృహాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మధ్యన గల ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించడం ప్రజలకు ఇటు వాహనదారులకు అటు విద్యార్థిని,విద్యార్థులకు ఎంతో ప్రాణ సంకటాన్ని కలిగించిన మద్యం
టెండర్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఎంతో దుర్మార్గమని, అన్యాయమని ఆటవికమని, అమానుషమని,అనాగరికమని ఎంతో హేయమైన చర్యగా భావిస్తూ,భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతమైతే ప్రజల నుండి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు, సమాజ సేవకులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యను డిమాండ్ చేశారు.
21 10 2025 నాడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పాత్రికేయ సోదరులకు మరియు సోషల్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఈ సమాజంలో అసాంఘిక కార్యక్రమాలకు, భార్యాభర్తల గొడవలతో కాపురాలు కూలిపోవడానికి, అల్లర్లకు రేపులకు మర్డర్లకు అతి ప్రధానమైనటువంటి బ్రాందీ విస్కీ మందును
ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క ప్రజా ప్రభుత్వము అనే ప్రభుత్వమే విచక్షణారహితంగా మందును విక్రయించడం ఎంతో శోచనీయమైనదని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆవేదనను వ్యక్తపరిచారు.
మన రెండు తెలుగు ప్రభుత్వాలు పొరుగున ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనిఅక్కడ మద్యం మాంసం విక్రయాలను నిషేధించడం జరిగిందని ఆ ప్రభుత్వానికి కావలసిన ఆదాయ వనరులను, లంచాలను , అవినీతి అక్రమాలను రూపుమాపి, వేరే మార్గాలలో చట్టబద్ధంగా సంపాదించుకొని , అన్ని రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా నిలబడిందని ఆ రాష్ట్రాన్ని చూసి మన నాయకులు, రాజకీయ పార్టీలన్నీ సిగ్గుతో తలవంచుకోవాలని ఆచార్య డాక్టర్ మద్దెల హితవు చెప్పారు.
మద్యం తాగవద్దని ఒకవైపు విద్యార్థులకు పాఠాలలో నేర్పిస్తూనే మద్యం అమ్మకాలను ఏరులైప్రవహింప చేస్తూ అటు బెల్టు షాపులను కూడా ఇబ్బడి ముబ్బడిగా మంజూరు చేసినడిపించడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆచార్య డాక్టర్ మద్దెల ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోవడానికి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని,
అవినీతి అక్రమాలను లంచాలను అరికట్టాలని,
ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులందరూ లక్షల కోట్ల రూపాయలను కూడ పెట్టుకుంటున్నారని లక్షల వేల ఎకరాలతో ఫామ్ హౌస్ లను కట్టించుకుంటూ దోపిడీ చేస్తున్నారని, అటువంటి వాళ్లు తమ సంపాదనలో కొంత ప్రజల సంక్షేమానికి , సమాజ శ్రేయస్సుకు ఖర్చు పెడితే, ఈ రాష్ట్రం మే కాకుండా దేశము బాగుపడతాయని
ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణించారు
తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంతో అభిమానినని, కానీ ప్రజల్లో ఏ కోణంలో అసంతృప్తి వస్తున్నదో గమనించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని, ఆచార్య డాక్టర్ మద్దెల అభిప్రాయపడ్డారు చెప్పి బుద్ధి యూనియన్ అల్లిశంకర్, సినీ నటులు చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూర్ ధనరాజ్ ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి లావుడియా సత్యనారాయణ, కార్యదర్శి వరప్రసాద్, పి సురేందర్,
డాక్టర్ జోసఫ్, రాకేష్ తదితరులు ఉన్నారు.