ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో
వికాస తరంగిని సెంట్రల్ కమిటీ వారి డ్రాయింగ్ వ్యాస రచన పోటీలు
చిన జీయర్ స్వామి పిలుపు
తేదీ. 25.07.2024 గురువారం స్థానిక గ్రామము మండలం నర్సంపేట లోని మదర్స్ లాండ్ హై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు, శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాఛార్య త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వారి ఆదేశాను సారం ఏర్పాటు చేసిన వికాస తరంగిని నర్సంపేట శాఖ, ప్రజ్ఞ, సంస్కార విభాగ మరియు పాఠశాల ఉపాధ్యాయుల వారి సమక్షంలో తరగతి గదిలో వ్యాస రచన, మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు 6,7,8,9,10 తరగతులు వారు పోటీల్లో పాల్గొన్నారు, వికాస తరంగిని ప్రజ్ఞ, సంస్కార విభాగ్ బాధ్యులు మెరుగుజు.రేణుక, గొట్టేపర్తి త్రివేని, ఎర్రబోయిన.రాజశేఖర్ మరియు అధ్యక్షులు శ్రీ కృష్ణా రావు, రంగనాధ్ పాల్గొన్నారు, రేణుక మాట్లాడుతూ వికాస తరంగిని ఆధ్యాత్మిక భావాలు చిన్న నాటి నుండే విద్యార్థి దశలో చదువుతో పాటు భక్తి భావం ఉండే విధంగా ఈ పోటీలు జరుగుతున్నాయని చెప్పారు, త్రివేణి మాట్లాడుతూ ఆన్లైన్ ఆఫ్ లైన్ లో జరిగే వ్యాస రచన, డ్రాయింగ్ వేస్తున్న విద్యార్థులను చూసి అభి నందించారు, దేశ రక్షణ కై సైనిక దళ ఆర్ట్ దృశ్యాలు, భారత మాత, దేశ చిత్రములు సమరయోధులైన గాంధీ, అంబేద్కర్ భగత్ సింగ్, సరిహద్దు దలాలు, త్రివర్ణ పాతకము లాంటి వారి చేతితో చాలా చక్కగా పెన్సిల్ కలర్స్ నింపుతూ పిల్లలు 6 నుండి 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, చివరగా ఆతిద్య హై స్కూల్ కరెస్పాండంట్ శ్రీ పాశికంటి రమేష్ నవిత గారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే దేశం పై ప్రేమ అభిమానం ఇండియన్ అనే అభ్యుదయ భావాలు కలిగే విధంగా వికాస తరంగిని సెంట్రల్ కమిటీ నిర్వహిస్తున్న ఇట్టి వేడుకలు ఉపయుక్తముగా ఉన్నాయని వికాస తరంగిని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు, కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు శ్రీనివాస అజీజ్ పాషా బాలుకుమార్ మహేందర్ రూపావతి తదితరులు పాల్గొన్నారు.