బతుకమ్మ–దసరా సంబరాలతో లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ సందడి

బతుకమ్మ–దసరా సంబరాలతో లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ సందడి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం సెప్టెంబర్) 20

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లో బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, డైరెక్టర్స్ పూలతో అలంకరించిన బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.

డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవడం పాఠశాల సంప్రదాయమని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది, మీడియాకు బతుకమ్మ–దసరా శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్ పున్న రాజేష్, డైరెక్టర్స్ పున్న అరుణ, పావని, ప్రిన్సిపాల్ స్వాతిప్రియతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now