ట్రిపుల్ ఐటీ బాసర్ లో సీటు సాధించిన లిటిల్ స్కాలర్స్ విద్యార్థిని
– కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, కామారెడ్డికి చెందిన గ్రేడ్ 10 (బ్యాచ్ 2024–25) విద్యార్థిని ఎన్. శివానీ, ప్రతిష్ఠాత్మకమైన ట్రిపుల్ ఐటీ బాసర్ లో సీటు సాధించడం గర్వకారణంగా ఉందనీ ఆ పాఠశాల చైర్మన్ పున్న రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెను స్కూల్ ప్రిన్సిపాల్ స్వాతి ప్రియ తో కలిసి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ
శివానీ తన కృషితో, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకుందన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధనే ఈ విజయానికి కారణమని వారు పేర్కొన్నారు. శివానీ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.