DJ సౌండ్తో ప్రాణాలు పోతాయా?
డీజేల దగ్గర డాన్స్ చేస్తున్నారా? జాగ్రత్త.
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
డీజేల వద్ద డాన్సులు చేస్తూ చనిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే డీజే శబ్దాలతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని జర్మనీలోని ఓ వర్సిటీ అధ్యయనంలో తేలింది. బీపీ పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయే అవకాశమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్లకు అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉందని, గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచించారు.