కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ.
●రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
●హర్షం వ్యక్తం చేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊషగోని శంకర్ గౌడ్.
●రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
మెదక్ జిల్లా. శివ్వంపేట మండలం, గూడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊషగోని శంకర్ గౌడ్, మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో రైతుల రుణమాఫీ ప్రక్రియ మూడు విడతల్లో ఆగస్టు 15 లోపు విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి, ఒక రైతుగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతును రాజు చేయడమే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరి అయిన సమయంలో రుణమాఫీ చేస్తుందన్నారు.