నాంచారి పేటలో రుణమాఫీ కానీ రైతుల దరఖాస్తు సేకరణ
మోటకొండూర్ ఆగస్టు 31
ప్రశ్న ఆయుధం :
రేషన్ కార్డు లేక ఇతర కారణాలతో రుణమాఫీ పథకం అమలు కాని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నట్లు మోటకొండూర్ ఏవో రమాదేవి తెలిపారు. ఆమె మోట కొండూరు మండలం నాంచారి పేట గ్రామంలో శనివారం రోజు 60 రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 60 కుటుంబ నిర్ధారణ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ డి .వెంకటేష్ రైతులు పాల్గొన్నారు