రుణమాఫీ కానీ రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి

*రుణమాఫీ కాని రైతులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలి..*

*జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*

రుణమాఫీ కాని రైతులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. జమ్మికుంట పట్టణంలో శుక్రవారం రేషన్ కార్డు లేకుండా రుణమాఫి కానీ రైతుల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్ లో నమోదు చేశారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మీ పరిశీలించి త్వరిత గతిన సర్వే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
రేషన్ కార్డు లేని వారికి సంబందించి పంట రుణమాఫీ కోరకు సర్వే చేయడం జరుగుతున్నదని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి గ్రామాల వారీగా దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మమత వ్యవసాయ విస్తరణ అధికారులు రాంప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now