ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
రుణమాఫీ డబ్బును పెట్టుబడి కోసం వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ రైతులకు సూచించారు. శివ్వంపేట మండలం గోమారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖను సందర్శించారు. బ్యాంకు పరిధిలో 820 మంది రైతులకు రూ.4.49 కోట్ల రుణమాఫీ అయిందని బ్యాంకు మేనేజర్ వివరించారు. శివ్వంపేట రైతు వేదికలో రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏవో లావణ్య, ఏఈఓలు మాజీద్ అలీ, రవి, భవాని, మౌనిక పాల్గొన్నారు.