Site icon PRASHNA AYUDHAM

రుణమాఫీ పూర్తవుతుంది హరీష్ అన్నా రాజీనామా ఎప్పుడు..?

రుణమాఫీ పూర్తవుతుంది హరీష్ అన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యవా?

కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్

జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం జులై 21

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో ఆగస్టు 15 లో చేయనుందని హరీష్ రావు రుణమాఫీ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నావు అన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డి శ్రీనివాస్ అన్నారు హుజురాబాద్ నియోజకవర్గం లోని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగిందని ఈ విషయంపై స్పందించిన హరీష్ రావు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినట్లయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయనని సవాల్ చేయడం జరిగిందని హరీష్ రావు ఇచ్చిన హామీపై నిలబడి రాజీనామా చేయాలని చేయని పక్షంలో అతనిపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారని గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకుండా రైతులపై వడ్డీ భారాన్ని వేసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇప్పటికైనా బిఆర్ఎస్ బిజెపి నాయకులు పనికిమాలిన సవాల్ చేయకుండా రైతులకు ఉపయోగపడే హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని గడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గొర్ల సునీల్ సల్పల సాయిలు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version