స్థానిక సమస్యలు పరిష్కరించాలి
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడవద్దు
సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్
జమ్మికుంట ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం
స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్ అన్నారు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మోత్కులగూడెం దుర్గా కాలనీ కాలనీలలో సిపిఎం బృందం ఇంటింటి సర్వే నిర్వహించి పలు సమస్యలను గుర్తించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా స్థానిక సమస్యలు పరిష్కరించడం లేదని దుర్గా కాలనీ లోని డ్రైనేజీ సౌకర్యం సరిగా లేక ఇళ్లలోకి మురుగు నీరు వచ్చి పందులు కుక్కలు, దోమలు వస్తున్నాయని వీటి బారిన పడి కాలనీవాసులు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో నీటి నిల్వ ఉండడం వలన అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని మున్సిపల్ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు ఏరియాలో ఖాళీ స్థలం ఉండడం వల్ల చెట్లు మురికి నీరు చేరి దుర్గంధం వస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని
దుర్గ కాలనీ ఏరియాలో నల్ల నీళ్లు కూడా రావడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈ సమస్యలన్నింటిని మునిసిపల్ అధికారులు పట్టించుకోని ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారించాలని పేర్కొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని పేదలకు తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలని, నగరంలో రోడ్లు డ్రైనేజీ బాగు చేయాలని
కొంతమంది దగ్గర ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రెసిడెంట్ కాపీలను మళ్లీ వెనక్కి తీసుకోవడం ఏంటి అని మళ్లీ రీసర్వే నిర్వహించి వారికి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కరెంటు స్తంభాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి చెట్లు తీగల ఆనుకొని వర్షం వస్తే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని వాటిని గుర్తించి విద్యుత్ అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరారు
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ అమలు చేయకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వెంటనే అర్హులైన మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇవ్వాలన్నారు ఇప్పటికైనా సమస్యలన్నింటిని పట్టించుకోని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్ దండిగారి సతీష్ వడ్లూరు కిషోర్ కుమార్ గేరే రాజకుమారి కన్నం సదానందం తదితరులు పాల్గొన్నారు