రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టిని కలిసిన బొమ్మెర శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు తీరని అన్యాయం జరిగింది. స్థానిక ఎస్సీ రిజర్వేషన్లు తొలగించినందున తిరిగి అమలు చేయాలని. తెలంగాణ రాష్ట్రం పేరు పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున రిజర్వేషన్ 20% పెంచాలని కోరారు. వైరా నియోజకవర్గ స్థానాల లక్ష్యం పురం వచ్చిన సందర్భంగా. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కలిసి వినతిపత్రం అందజేశారు. వైరా నియోజకవర్గం స్థానాల లక్ష్యం పురం బట్టి విక్రమార్క నివాసంలో శుక్రవారం కలిసి ఏజెన్సీ కాంత ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్లు 2019 సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్లు తొలగించడం వలన ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్నగర్ నాలుగు జిల్లాలు 86 మండలాల్లో సుమారు 10 లక్షల పైన జనాభా కలిగిన ఎస్సీ కులాల తరఫున ఒక ప్రజా ప్రతినిధి లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ఎస్సీ కులాలను గుర్తించి ప్రజా పాలన ప్రభుత్వం నామినేట్ పదవుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున రిజర్వేషన్ 20% పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రజని అంబేద్కర్, కమిటీ సభ్యులు, సలిగంటి కొమరయ్య, జేరిపోతుల సుందరం, రాములు తదితరులు పాల్గొన్నారు.