సెప్టెంబర్ లోనే స్థానిక సమరం..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, అందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి అసెంబ్లీలో సవరణకు ప్రతిపాదించనుంది 50% రిజర్వేషన్లు పరిమితిని ఎత్తివేస్తూ శనివారం ప్రారంభమైన వర్షాకాల సమావేశంలో బిల్లును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచించినట్లు తెలుస్తుంది
స్థానిక ఎన్నికల నిర్వహణ కు సీఎం రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్ల పరిమి తిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితిపై తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును ఈ అసెంబ్లీ లో ప్రవేశపెట్టనుంది.
అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక జీవో తీసుకొచ్చి కులగణన ఆధారంగానే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది.