హెచ్ పి గ్యాస్ డీలర్ పై స్థానికుల ఆగ్రహం

హెచ్ పి గ్యాస్ డీలర్ పై స్థానికుల ఆగ్రహం

సబ్సిడీ లేకుండా, తూకంలో మోసం

నిజామాబాద్ జిల్లా

(ప్రశ్న ఆయుధం) జులై 14

 

గ్యాస్ వినియోగదారులకు న్యాయం జరగడం లేదు. గ్యాస్ సబ్సిడీ మంజూరు కాకుండా, సిలిండర్ బరువులో భారీ తేడాలు, నమోదవుతున్నాయని, స్థానికులు ఆరోపిస్తున్నారు.

సిలిండర్ ధర కంటే అదనంగా వసూలు చేస్తూ, బిల్ ఇవ్వకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ తీసుకునే సమయంలో రశీదు కోరిన వినియోగదారులపై, HP గ్యాస్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని సమాచారం.

ఈ నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment