Site icon PRASHNA AYUDHAM

అనుమతి లేని ఆసుపత్రులకు తాళం

IMG 20250925 WA0016

అనుమతి లేని ఆసుపత్రులకు తాళం

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – కలెక్టర్ హెచ్చరిక

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25

 

జిల్లాలో ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలనే ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఆసుపత్రులు లేదా రోగ నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనుమతి లేని ఆసుపత్రులు లేదా సెంటర్లకు నోటీసులు ఇవ్వాలని, అలాంటి వారు అడ్వర్టైజ్ చేయరాదని, అర్హత లేని వారు వైద్య సేవలు అందిస్తే వెంటనే సీజ్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రైవేట్ ఆసుపత్రులను క్రమం తప్పకుండా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్లను పరిశీలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడరాదని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, డిసిహెచ్ఎస్ విజయలక్ష్మి, జిల్లా ఉపవైద్యాధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version