Site icon PRASHNA AYUDHAM

రైల్వే బెజవాడ డివిషన్లో లోకో పైలట్ హత్య..

రైల్వే బెజవాడ డివిషన్లో లోకో పైలట్ హత్య 

విజయవాడ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే బెజవాడ డివిజన్లో లోకో పైలట్ గా పని చేస్తున్న డి. ఎబినేజర్ అనే లోకో పైలట్ని ఓ అగాంతకుడు హత్య చేశాడు… ప్రాథమిక సమాచారం మేరకు ఆన్ డ్యూటీ లో ఉన్న లోకో పైలెట్ సుమారు రాత్రి రెండు గంటల సమయంలో నైజాం గెట్ సమీపంలో విధి నిర్వహణలో భాగంగా రైల్వే రోడ్ నెంబర్ 11 లో ఆయన వెళుతుండగా  అకస్మాత్తుగా అతనిపైదాడి చేసి ఇనుప కడ్డీతో బలంగా తలపై మోదీ ఆయనను హత్య చేసి పరారయ్యాడు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతం అతని మృతదేహం గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.. ఈ సంఘటన తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే లోకో పైలట్ అసోసియేషన్ ఆందోళనకు దిగారు. తమకు. ప్రాణభద్రత కల్పించాలంటూ ఆందోళనకు దిగారు..

Exit mobile version