దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్ష దిగ్విజయం

*దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్ష దిగ్విజయంIMG 20241113 WA0101

*

 

భూతలంపై దాడులు చేయగల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి (ఎల్ఆర్ఎల్ఎసీఎం)ని భారత్ మంగళవారం తొలిసారిగా పరీక్షించింది. ఒడిశా తీరానికి

చేరువలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతంగా సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

ఎల్ఆర్ఎల్ఎసీఎంను బెంగళూరు లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. డీఆర్డీవోకు చెందిన పలు ల్యాబ్ లు, ప్రైవేటు పరిశ్రమలు దీని రూపకల్పనలో

పాలుపంచుకున్నాయి.

Join WhatsApp

Join Now