Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డిలో మద్యం షాపుల లాటరీ

IMG 20250925 182524

కామారెడ్డిలో మద్యం షాపుల లాటరీ

— రిజర్వేషన్ల కింద ఎస్సీ, ఎస్టీ, బిసి గౌడలకు కేటాయింపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25

 

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ (2025–27)లో భాగంగా జిల్లాలోని మద్యం షాపుల కేటాయింపుకు లాటరీ డ్రా నిర్వహించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో, వీడియోగ్రఫీ మధ్య ఈ డ్రా కార్యక్రమం జరిగింది.

జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో 5 ఎస్సీ సామాజిక వర్గానికి, 2 ఎస్టీ వర్గానికి, 7 బిసి గౌడ కులాలకు రిజర్వేషన్ కింద లాటరీ ద్వారా షాపులు కేటాయించబడ్డాయి. ఎంపికైన షాపుల వివరాలు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఆమోదం కోసం పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి వెంకటేష్, బిసి అభివృద్ధి అధికారి జయరాజ్, ఎస్టీ అభివృద్ధి అధికారి సతీష్‌తో పాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version