Site icon PRASHNA AYUDHAM

మహారాష్ట్ర, జార్ఖండ్ ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించడం ఖాయం

మహారాష్ట్ర, జార్ఖండ్ ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించడం ఖాయం

*ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది*

*రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలి*

*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*

ప్రశ్న ఆయుధం, నవంబర్ 21, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణానికి చెందిన 91 మంది యువకులు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని మహారాష్ట్ర, జార్ఖండ్ ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికశించడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందనీ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలనీ అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version