ఎమ్మెల్యేపై అభిమానం.. గుండెలపై పచ్చబొట్టు!
AP: అభిమాన నేతపై ఓ యువకుడు చూపించిన అభిమానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మీద అభిమానంతో ఆమె చిత్రాన్ని గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడో యువకుడు. గుండెల్లో ఉన్న అభిమానాన్ని.. గుండెలపై పచ్చుబొట్టు ద్వారా తెలియజేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.