ఎల్ఆర్ఎస్ భవన నిర్మాణాలు కు అనుమతులు ఇవ్వాలి
కూకట్పల్లి ప్రశ్న ఆయుధం జూలై 23
కూకట్పల్లి నియోజకవర్గం, బాలానగర్,
బుధవారం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కలిసి కెపిహెచ్బి డివిజన్ వసంత్ నగర్, ఎన్ఆర్ఎస్ ఐ. కాలనీ..భగత్ సింగ్ నగర్, ఫేస్ 1 ,2 సర్దార్ పటేల్ నగర్..సిబిసిఐడి కాలనీ, మొదలగు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అనుమతులు కొరకు చర్యలు తీసుకోవాలని.. వీరు ఎల్ఆర్ఎస్ మరియు ఇతర అన్ని అనుమతులు ఉన్నా ప్రభుత్వం నిర్మాణాల కు అనుమతి ఇవ్వకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే అని…దీనిపై ఇదివరకు కలెక్టర్ నీ కలిసి వినతి పత్రం అందించామని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి అనుమతులకు మార్గం సుగమం అయ్యేటట్లు ఏర్పాటు చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు, డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి..కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు…